వచ్చే నెల నుంచి వారికి రేషన్ బంద్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

వచ్చే నెల నుంచి వారికి రేషన్ బంద్..!
– మళ్లీ పొందాలంటే ఇది చేయాల్సిందే
– లబ్దిదారులకు ప్రభుత్వ హెచ్చరిక
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలో ఎంతో నిరుపేదలు రేషన్ బియ్యం ఆధారంగా కుటుంబ పోషణ పొందుతున్నారు. తెలంగాణలో వచ్చే నెల నుంచి రేషన్ లబ్దిదారులకు బియ్యం పంపిణీ నిలిపివేయనుంది. దేశంలో నకిలీ రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం ఈకేవైసీ తీసుకవచ్చింది.

కార్డు కలిగిన కుటుంబంలో ఒకరు వేలిముద్ర వేసి ప్రతినెలా రేషన్‌ తీసుకుంటున్నారు. మిగిలిన సభ్యుల్లో కొందరు చదువులు, ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉంటుండటంతో అటువంటి వారి వేలిముద్రలు అప్‌డేట్‌ కాలేదు. దీంతో ప్రస్తుతం తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని అలాంటి సభ్యులందరిచేత తప్పనిసరిగా ఈకేవైసీ చేయించే విధంగా చర్యలు తీసుకున్నారు ఈకేవైసీ పూర్తయితేనే పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయి. లేకపోతే, రేషన్ సహా ఇతర సబ్సిడీలు కోల్పోయే ప్రమాదం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోలేని వారికి బియ్యం పంపిణి నిలిపివేస్తన్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

గతంలో గడువు పొడిగించినప్పటికీ, ప్రస్తుతం మార్చి 31, 2025ని తాజా గడువుగా నిర్ణయించారు. అందువల్ల తెలంగాణలో కూడా మార్చి 31 లోపు ఆధార్ కార్డు నంబర్‌ని రేషన్ కార్డుకి లింక్ చేసుకోవాలి. ఈ పనిని రేషన్ షాపుల్లో డీలర్లు చేస్తారు. వారి దగ్గరకు వెళ్లి, విషయం చెబితే.. 5 నిమిషాల్లో పనైపోతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులు తమ సమీప పీడీఎస్ దుకాణాల్ని సంప్రదించి, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇక మళ్లీ గడువును పొడిగించే అవకాశాలు తక్కువేనని విశ్లేషుకులు అంటున్నారు.

ఇదికూడా చదవండి…

గుమ్మడి గింజల్లో ఆరోగ్యం..!