42 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
– 29 సెల్ ఫోన్లు, 10 బైకులు , రూ. 1,87, 980 నగలు స్వాధీనం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలో పండగరోజు పేకాట రాయుళ్లపై మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు పేకాట కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 42 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 29 సెల్‌ఫోన్లు, 10 బైకులతో పాటు రూ. ఒక లక్షా 87 వేల 980ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తున్నట్లు వికారాబాద్ సిఐ రాజశేఖర్ తెలిపారు.
