రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలి
– అటవీ భూముల సాగులో ఉన్నోళ్లకు హక్కులు కల్పించాలి
– శాసన మండలిలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజన రైతులతో పాటు ఇతర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కోరారు. గురువారం జరిగిన శాసన మండలిలో మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో భూములును సాగుచె సుకుంటున్న గిరిజన రైతులు, ఇతర రైతుల సమస్యలపై ప్రస్తావన తెచ్చారు.

తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ తదితర మండలాలతో పాటు వికారాబాద్ పరిసర మండలాల్లోని రైతులు గత 30, 40 ఏండ్లుగా అటవీ భూముల్లో సాగు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అయితే అటవీ శాఖ అధికారులు వీరి భూములను స్వాదీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలను గతంలో పరిష్కరించేందుకు చేసిన కృషి ఫలించలేదన్నారు.

అపరిష్కారంగా ఉన్న ఈ రైమను మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించాలని కో రారు. రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అవే భూముల్లో గిరిజన రైతులకు, ఇతర రైతులకు భూ యజమాన్య హక్కులు కల్పించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

వసతులు, సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ