ఎల్ఆర్ఎస్ పోడగింపు..!
– ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడగింపుకు నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్నంతమేర స్పందన రాలేదు. దీంతో తాజాగా ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి…

