పెసరపప్పులో పోషకాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

పెసరపప్పులో పోషకాలు..!
– చికెన్, మటన్‌ కంటే ఎక్కువ ప్రోటీన్లు
– శాఖాహారులు తింటే సూపర్ బూస్ట్
– ఎముకలతో పాటు నాడీ వ్యవస్థ మెరుగు
దర్శిని డెస్క్ : పెసర పప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇందులో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని అందించడమే కాకండా బలం కూడ అందిస్తుంది. అంతేకుండా పెసర పప్పు తింటే చికెన్, మటన్, గుడ్లకన్న మించి ప్రోటీన్లు అందిస్తాయని షాకింగ్ సీక్రెట్లు తెలుస్తున్నాయి. పెసర పప్పు నుంచి ఇంకా మరిన్ని అద్భుత ప్రయోజనాలను తెలుసుకుందాం రండి.

ఈ పప్పులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6 వంటి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో అనేక విధాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తాయి. దాంతో పాటు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉన్న ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మాంసాహారాన్ని తీసుకోని వారు ప్రోటీన్ కోసం పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. పెసరపప్పు అంటేనే పోషక విలువలతో నిండి ఉంటుంది. సాధారణంగా మనం చికెన్, మటన్, గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనుకుంటాం. కానీ పెసరపప్పులో ఉండే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసాహారాన్ని తినని వారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా శాకాహారులు ఈ పప్పును తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందవచ్చు.

గ్యాస్, అజీర్తి సమస్యలకు చెక్…
ఇది తినడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. రోజువారీ పనులలో చురుకుగా ఉండాలంటే శక్తి అవసరం. పెసరపప్పు తీసుకుంటే శక్తి స్థాయిలో మెరుగుదల కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యాయామం చేసే వారి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెసరపప్పులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు మంచి మద్దతు ఇస్తుంది. గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. ఇది తినడం అలవాటుగా మార్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు సహజంగా తగ్గుముఖం పడతాయి. మలబద్దకం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పెద్దలకే కాదు.. పిల్లల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి సమస్యలకు పెసరపప్పు మంచి సహాయకారి. ఇది క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం తగ్గి, శరీరం హైడ్రేట్‌గాను, శుభ్రంగాను ఉంటుంది.

రక్తహీనత సమస్యలు ఉన్నవారికి కూడా పెసరపప్పు మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అధికంగా అలసట, బలహీనత వంటివి ఉండే వారికి ఇది తినమని సూచిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పెసరపప్పులో ఉన్న మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గిస్తాయి. దాంతో రక్తప్రసరణ సరిగా జరిగి హైపర్‌టెన్షన్ సమస్యలు దూరమవుతాయి. ఈ పప్పు తినడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఇదికూడా చదవండి….

తస్మాత్…. జాగ్రత్త…!