రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..!
– రెండు ముంబై రైళ్లకు బోగిల పెంపు
– నిర్ణయం తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే
– ఏ రైళ్లకు ఎన్ని బోగీలను జత చేస్తున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదారాబాద్, ముంబై మద్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుతున్న రెండు రైళ్లకు అదనంగా బోగీలను జత చేసేందుకు దక్షిణ మద్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే బోగీలను పెంచి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు సిద్దమైంది. ఈ నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు ఇకమీదట రైళ్లలో కిక్కిరిసి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా కొంత సౌకర్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో దేశ వ్యాప్తంగా పలు ప్రధాన రైళ్లలో ఉన్న సాధారణ బోగీలను కుదించారు. దీని కారణంగా ప్రధాన పట్టణాలు, రాష్ట్రాలకు తిరిగే రైళ్లలో సైతం సాధారణ బోగీలు ఒక్కటికే పరిమితం చేశారు. కొవిడ్‌ సమయంలో ప్రయాణికులు తక్కువ ప్రయాణించగా ఆ తరువాత పరిస్థితులు చక్కబడటంతో రద్దీ పెరిగింది. దూర ప్రాంతాల రైళ్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికులు మరుగుదొడ్లలో సైతం కూర్చుని ప్రయాణిస్తున్న విషయం గుర్తించిన రైల్వే అధికారులు బోగీలను పెంచాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లే ముంబై ఎక్స్‌ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రెండు జనరల్ బోగీలను, ఒక స్లీపర్ బోగీలను అదనంగా చేర్చనున్నారు. గతంలో ఈ రైళ్లకు ముందు, వెనక ఒక్కోక్క జనరల్ బోగీలు మాత్రమే ఉండేవి. దీంతో అత్యధికంగా వెళ్లే సాధారణ ప్రయాణికులు కిక్కిరిసిన ప్రయాణాలతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో పూణే, బీవండి, ముంబై వెళ్లే ప్రయాణికుల కష్టాలు కొంత తీరనున్నాయి. మరోవైపు గత మూడేళ్లుగా బోగీలు పెంచాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

కంత్రి కేటుగాడు…!