జిల్లా ఆస్పత్రి సేవలు బేష్‌!

తాండూరు వికారాబాద్

జిల్లా ఆస్పత్రి సేవలు బేష్‌!
– డాక్టర్ల కృషివల్లే ప్రసవాల్లో రెండో స్థానం
– జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు బేషుగ్గా ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అన్నారు. వైధ్యుల కృషివల్లే ప్రసవాల్లో వరుసగా రాష్ట్రస్థాయిలో రెండో స్థానం వచ్చిందన్నారు. జిల్లా ఆస్పత్రిలోలో జిల్లాకు చెందిన వారికే కాకుండా మహబూబ్‌నగర్, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే రోగులకు, గర్భణీలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌ నుంచి ఆస్పత్రి అభివృద్ధికి ఇదివరకే రూ.60 లక్షలకు పైగా నిధులు కేటాయించి పనులు చేయించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే రానున్న రోజుల్లో ఆస్పత్రిలో ప్రసవాలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేల వైధ్యులు కృషిచేయాలని సూచించారు. అయితే ఆస్పత్రికి వచ్చే గర్భణీలకు సాధారణ ప్రసవాలు జరిగేల చూడాలని అన్నారు