ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సీనేష‌న్ తీసుకోవాలి

ఆరోగ్యం తాండూరు

ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సీనేష‌న్ తీసుకోవాలి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా నియంత్ర‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సీనేష‌న్ తీసుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శ‌నివారం మున్సిప‌ల్ ప‌రిధిలోని 21 వార్డులో కొన‌సాగుతున్న వ్యాక్సీనేష‌న్ ఇంటింటి స‌ర్వేను చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ప‌రిశీలించారు. వార్డు కౌన్సిల‌ర్ స‌ల్మా పాతిమా జుబేర్ లాలతో క‌లిసి వార్డులో ఎంత‌మంది వ్యాక్సీనేష‌న్ వేసుకున్నారు..? ఇంకా ఎంత‌మంది వేసుకోవాల‌ని స‌ర్వే బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చైర్ ప‌ర్సన్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ, అంగ‌న్‌వాడి టీచర్, డ్వాక్రా ఆర్పీ, బిల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.