భద్రేశ్వరున్ని దర్శించుకున్న మల్లికార్జున అప్పాజీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరున్ని దర్శించుకున్న మల్లికార్జున అప్పాజీ..!
– దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు
– జాతర ఉత్సవాలలో భక్తులకు దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో వెలసిన స్వామి వారిని శ్రీశ్రీశ్రీ గురు మల్లికార్జున స్వామి అప్పాజీ దర్శించుకున్నారు. మంగళవారం భద్రేశ్వర జాతర ఉత్సవాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాలకు హాజరు కావాలని ఇదివరకే తాండూరు భక్తులు మల్లికార్జున అప్పాజీకి విజ్ఞఫ్తి చేశారు.

భక్తుల కోరిక మేరకు మంగళవారం సాయంత్రం మల్లికార్జున అప్పాజీ భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఆలయ పండితులు, ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తదితరులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున అప్పాజీ దేవాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు తరలివచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆలయ చైర్మన్, కమిటి సభ్యులు అప్పాజీని ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి….

పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ