పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ

తాండూరు రాజకీయం వికారాబాద్

పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– హకీంపేట్ భూ రైతులకు చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు (ఎంపీఐపీ)కు 50శాతం భూ సేకరణ పూర్తి అయ్యిందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక పార్కుకు హకీంపేట్ గ్రామానికి చెందిన 33 మంది రైతులు వారికి చెందిన 56.04 ఎకరాల భూములు అందించారు.

వారికి ప్రభుత్వం ద్వారా పరిహారం మంజూరు కావడంతో తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా సంబంధిత రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ పూర్తి అయినట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు అందించిన నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం