తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు
– బీదర్, యాద్గార్ లకు రవాణా సౌలభ్యం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రవాణా శాఖ మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీపో నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ అన్నారు. శనివారం తాండూరు ఆర్టీసీ డీపోను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు సేవలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డీపో మేనేజర్ సురేష్ కుమార్ తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీపో మేనేజర్ తాండూరు ఆర్టీసీ డీపో నుంచి తాండూరు బీదర్, తాండూరు యాద్దీర్ సర్వీసులు కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

డీపో మేనేజర్ దృష్టికి తెచ్చిన అంశాలతో పాటు తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

