రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి
– బీఆర్ఎస్ నాయకులు డా.సంపత్ కుమార్
– ముస్లిం సోదరులకు పండగ కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరులు రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డా.సంపత్ కుమార్, బొప్పి సుకన్య కృష్ణలు అన్నారు.

రంజాన్ పండగను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని 27వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులకు డా.సంపత్ కుమార్ బొప్పి కృష్ణ ఆధ్వర్యంలో పండగ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండగ ఎంతో పవిత్రమైందని అన్నారు. పండగను పేద, ధనికులందరు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. వార్డు ప్రజలకు పండగ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని డా.సంపత్ కుమార్ బొప్పి కృష్ణను అభినందించారు.


