ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
– సత్తా చాటిన గురుకుల కాలేజీల బాలికలు
– మెరిసిన మోడల్ స్కూల్ అమ్మాయిలు
తాండూరు/తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు హవా చాటుకున్నారు. మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలలో సత్తా చాటారు.

తాండూరు మండలం ఖాంజాపూర్ గేటు సమీపంలోని టీజీ రెసిడెన్షియల్ బాలికల కాలేజీలో మొదటి సంవత్సరంలో సీ.దీక్షిత (ఎంపీసీ- 467/470), జీ. స్పందన (ఎంపీసీ-467/470), జోగి భార్గవి(బైపీసీ-438/440), జీ. విజయలక్ష్మీ (బైపీసీ-435/440), రెండో సంవత్సరంలో ఎ. అక్షిత(ఎంపీసీ-989/1000), డీ.శ్రీలత (ఎంపీసీ-986/1000), బీ. మమత (బైపీసీ-992/1000), ఎం. శ్వేతాశ్రీ (983/1000)లు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇందులో జోగు భార్గవి బైపీసీలో 438 మార్కులతో స్టేట్ ర్యాంకు సాధించింది.

అదేవిధంగా టీజీ సోషల్ వెల్ఫేర్ లో మొదటి సంవత్సరంలో ఆర్. మాధురి(ఎంపీసీ-457/470), ఎం. శ్రీలత (బైపీసీ-436/440), రెండో సంవత్సరంలో పి. నందిని (ఎంపీసీ-974/1000), వై. నిఖిత(బైపీసీ-987/1000) సత్తా చాటారు. టీజీ మైనార్టీ స్కూల్, కాలేజీలో మొదటి సంవత్సరంలో పావని రెడ్డి(ఎంపీసీ-431/470), ఆసిమా(బైపీసీ-428/440), రెండో సంవత్సరంలో సుహానా భేగం (ఎంపీసీ-986/1000), ముస్కాన్ (బైపీసీ-979/1000)లు ప్రతిభ కనబరిచారు. మరోవైపు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని మోడల్ స్కూల్, కాలేజీలో మొదటి సంవత్సరంలో ఈ.పూజ(440/470), ఎం.హర్షినీ (400/470), ఎన్. హారిక(391/470), బైపీసీలోవి. నందిని(429/440), సీహెచ్. సంధ్య(424/440), చెన్నంగారి నేహ(400/440), సీఈసీలో జీ. శైలజ(472/500), కె. స్ఫూర్తి(342/500), ఆర్.నవనీత (422/500), రెండో సంవత్సరంలో ఎంపీసీలో ఎం. నందిని (968/1000), బి. బిందు(968/1000), బి. పావని (933/1000), బైపీసీలో ఎం. సోని(935/1000), బి. శివాని (929/1000), కె. హారిక (927/1000), సీఈసీలో కె. భార్గవి(841/1000), ఈ, శ్రీజ(840/1000), ఎస్. సంతోష (835/1000)లు సాధించి సత్తాచాటారు. ఇందులో మొదటి సంవత్సరంలో ఈ. పూజ, వి. నందిని, జీ.శైలజ, రెండో సంవత్సరంలో ఎం. నందిని. బి. బిందు, ఎం. సోని, కె. భార్గవిలో టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, అద్యాపకులు విద్యార్థులను అభినందించారు.

ఇది కూడా చదవండి….

సెల్యూట్.. శంకర్ సార్..!