దేశభక్తి చాటాలి
– బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత,
– హర్ ఘర్ తిరంగా జెండాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాల్సిన బాధ్యత ఉందని బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత అన్నారు. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో కౌన్సిలర్ సాహు శ్రీలత వార్డు ప్రజలకు ఇంటింటికి జాతీయ జెండాలను అందజేశారు. సాహు శ్రీలత మాట్లాడుతూ దేశానికి 75వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా అందరు జాతీయ సమైక్యతను చాటుకోవాల్సిన ఉందన్నారు. అందరు ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు, ఆర్పీలు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.



