పట్లోళ్ల బిడ్డకు డాక్టర్ పట్టా..!
– ఎంబీబీఎస్ పూర్తి చేసిన డా.రేవంత్ కుమార్
– మురిసిపోయిన మాజీ డీపీసీ, మాజీ వైస్ చైర్ పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల దంపతుల కుమారుడు పట్లోళ్ల రేవంత్ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు.

ఖమ్మం జిల్లాలోని మమతా మెడికల్ కాలేజీలో పట్లోళ్ల రేవంత్ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకోవడంతో శనివారం పట్టా అందజేశారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన పట్లోళ్ల నర్సింలు, రత్నమాల దంపతులు పట్టా అందుకున్న కుమారుడు రేవంత్ ఇక డాక్టర్ కావడంతో ఆనందంలో మునిగిపోయారు. తనయున్ని తనివితీరా ముద్దాడి అభినందించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందించాలని రేవంత్ ను ఆశీర్వదించారు.
మరోవైపు పట్లోళ్ల నర్సింలు కుమారుడు రేవంత్ డాక్టర్ గా మారడంతో తాండూరుకు చెందిన పలువురు నాయకులు, సాయిపూర్ ప్రాంత వాసులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి….

