మహాదేవునిగా దర్శనమిచ్చిన శివుడు
– ఘనంగా కార్తీక మాస పూజలు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాయలంలో వెలసిన శివుడు మహాదేవునిగా దర్శనిచ్చారు. తాండూరులో కార్తీక మాసం పూజలు సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భావిగి భద్రేశ్వర దేవాయలంలో ఆలయ పూజారి శివున్ని ప్రత్యేకంగా అలంకరించారు. మహాదేవునిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు మహాదేవునిగా దర్శనమిచ్చిన శివున్ని దర్శించుకున్నారు. పరమ శివుడుతో పాటు స్వామి ముందున్న నందీశ్వరునికి దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలోని శివాలయాల్లో భక్తులు కార్తీక మాసం పూజలు నిర్వహించారు.
