తాండూరులో ఆసక్తికర రాజకీయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్


తాండూరులో ఆసక్తికర రాజకీయం..!
– మాజీ ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ నేతలు
– నారాయణ రావుతో విఠల్ రెడ్డి మంతనాలు
– వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు
– చర్చనీయాంశంగా రాజకీయ భేటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇంటికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, పార్టీ నేతలు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
kvcs
ఆదివారం బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఆసక్తికర పరిణామం తాండూరు రసవత్తర రాజకీయాల చర్చలకు దారితీసింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మహేందర్ రెడ్డిగా రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నారు. తాజాగా ఆదివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి బషీరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావును ఆయన నివాసంలో కలిశారు.

ఈ భేటీలో ఎమ్మెల్యే నారాయణ రావు, విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. అయితే మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదేవి ధంగా స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ రమేష్ మహరాజ్ రావు సైతం పార్టీలో పాత కాంగ్రెస్ నేతలకు గౌరవం, నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని అవేదన వెలగక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే నారాయణ రావును విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి