పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్..!
– ఈనెల 5 నుంచి తరగతుల నిర్వహణ
– వెల్లడించిన ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుకు ఫ్రీ ట్యూషన్ నిర్వహిస్తున్నట్లు తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

గురువారం తాండూరులోని కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి యూనుస్, ఉపాధ్యక్షులు అబ్దుల్ సలీం, బాసిత్ అలీ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈనెల 5వ తేది నుంచి సప్లమెంటరీ పరీక్షలు కొనసాగే వరకు ఫ్రీ ట్యూషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు వారి మెమె జిరాక్స్, రెండు ఫోటోలతో పాటు రూ. 200లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మెహెందీ డిజైన్, టైలరింగ్ శిక్షణ ప్రారంభం అయ్యిందని, తాజాగా తాండూరు పట్టణంలోని అయేషా మోడల్ స్కూల్లో మరో సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల మహిళలు శిక్షణ చేరోచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జిలానీ పాష, ఉపాధ్యాయులు రవి కుమార్, సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

శుభకార్యాలలో బీఎస్ఆర్ సందడి