ఎంసెట్ ఫలితాల్లో తాండూరు విద్యార్థి సత్తా
– రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన అభినవ్ రెడ్డి
– ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి కుమారుడి ప్రతిభ
– మనుమన్ని అభినందించిన మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో తాండూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 447వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. యాలాల మండలం రాఘాపూర్ గ్రామానికి చెందిన గరుగుపల్లి నర్సిరెడ్డి తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

ఆయన కుమారుడు గరుగుపల్లి అభినవ్ రెడ్డి ఇటీవలే ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యాడు. అభివన్ రెడ్డి తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డికి మనుమడు కూడా. ఆదివారం విడుదలైన ఎంసెట్ – 2025 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 447వ ర్యాంకుతో మెరిశాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి, తాత లక్ష్మారెడ్డిలు అభినవ్ రెడ్డిని అభినందించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, సీనీయర్ రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి, బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, నాయకులు అబ్దుల్ రవూఫ్, రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేతలు తదితరులు అభినవ్ రెడ్డిని ఫోన్ లో ప్రత్యేకంగా అభినందించారు.

ఇదికూడా చదవండి…

