భార్య‌ను వేధించిన భ‌ర్త‌కు జైలుశిక్ష‌, జ‌రిమాన

క్రైం తాండూరు వికారాబాద్

భార్య‌ను వేధించిన భ‌ర్త‌కు జైలుశిక్ష‌, జ‌రిమాన
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార్య‌ను వేధించిన భ‌ర్త‌కు జైలుశిక్ష‌తో పాటు జ‌రిమాన విధిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయ‌మూర్తి తీర్పు వెలువ‌రించిన‌ట్లు క‌ర‌ణ్ కోట్ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. తాండూరు మండ‌లం గుంత‌బాస్పల్లి గ్రామానికి చెందిన స‌య్య‌ద్ అక్ర‌మ్ త‌న భార్య‌ను వేధించేవాడు. వేధింపులు తాళ‌లేక అతని భార్య 2014లో మ‌హిళ పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు భ‌ర్త అక్ర‌మ్‌పై చార్జీషీట్ న‌మోదు చేశారు. బుధ‌వారం తాండూరు మున్సిఫ్ కోర్టులో కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి టీ.స్వ‌ప్న నిందితుడైన భ‌ర్త అక్ర‌మ్‌కు రూ. 4వేల జ‌రిమాన‌తో పాటు 20 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు.