దేవీ నమోస్తుతే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవీ నమోస్తుతే..!
– నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రుల శోభ
– అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు
-ఆకర్షణగా నిలిచిన మహిషాసుర మర్దిని ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవీ నమోస్తుతే.. అంటూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ప్రతిరోజూ శరన్నవరాత్రుల శోభ సంతరించుకుంటుంది. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయంలో వెలిసిన వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తున్నారు.. నాలుగో రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు.

మంగళవారం ఆలయంలో జరిగిన శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆట్టహాసంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నాటక ప్రదర్శన నిర్వహించారు. చెడుపై అమ్మవారు సాధించిన వి జయాలను ప్రదర్శిస్తూ మహిళలు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనను తిలకించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు.

అనంతరం సభ్యులు నాటక ప్రదర్శన ఇచ్చిన మహిళలను అభినందించారు. ఇందులో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, వాసవీ మహిళ సంఘం సభ్యులు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి…

కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!