బీఎస్‌ఆర్ మానవత్వం..!
– క్యాన్సర్ బాధితుడికి అండ
– రూ.10 వేల ఆర్థిక సహాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన తోట్ల ఖాసింకు అండగా నిలిచారు. ఖాసి గురించి తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్గయ పరిస్థితిని ఆరా తీశారు.

వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఖాసిం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఖాసీంకు ఆర్థిక సహాయం అందించడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


