ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత
– అక్క అంత్యక్రియల్లో గుండె పోటు
– ఆసుపత్రికి తరలించేలోపు మృతి
– విచారం వ్యక్తం చేసిన నేతలు, డైరెక్టర్లు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్ భగవాన్ కరీం జీవితం విషాధంగా ముగిసింది. అక్క అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన భగవాన్ కరీం తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఉన్న అతని అక్క మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. గురువారం ఉదయం అంత్యక్రియల్లో ఉన్న భగవాన్ కరీం అస్వస్థతకు గురయ్యారు.

కొద్ది సమయానికి ఆసుపత్రికి వెళదామనేలోపు కుప్పకూలి పడిపోయాడు. కాసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందాడు. అక్కడి నుంచి ఆయన భౌతిక ఖాయాన్ని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్కు తీసుకవస్తున్నారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నేతలు, డైరెక్టర్లు విచారం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..!