200శాతం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

200శాతం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..!
– అందుకే స్కాంలు బయటికి వచ్చిన చర్యల్లేవ్
– వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖం లేదు
– నమ్మకం కోల్పోయిన బీఆర్ఎస్‌కు బొంద పెట్టడం ఖాయం
– గెలిచినా ఓడినా అన్ని గ్రామాల్లో స్థానిక పోరుకు సిద్ధం
– తెలంగాణను ఆదుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం
– చేవేళ్ల పార్లమెంట్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో 200శాతం కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యిందని చేవేళ్ల పార్లమెంట్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్కాంలు బయటకు వచ్చినా నేతలు జైలుకు పంపకపోవడానికి కారణమదే అని అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మండపం వద్ద ఎంపీలాండ్స్ నిధులు రూ. 5లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పనులు ప్రారంభించిన అనంతరం ఎంపీ కొండా మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, రైతుల అభివృద్ధికి మోడి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేవలం రైతుల కోసం రూ.25వేల కోట్లు వెచ్చిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 40లక్షల టన్నుల వరి ధాన్యం దిగుమతి అవసరముంటే రైతులు 2కోట్ల 80లక్షల టన్నులు పండిస్తుంటే కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. ఇందుకోసం రైతులకు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రతి యేడాది కిసాన్ నిధులు, యూరియాకు సబ్సిడి, ఇతర పథకాలకు రాయితీ రూపంలో నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. ఇదే కాకుండా గ్రామాల్లో స్మశాన వాటికలు, విద్యుత్ సమస్యలు, ఇతర పథకాలకు కూడా నిధులు కేటాయిస్తుందని అన్నారు. కేంద్రంపై అక్కను పెంచుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చిప్ప మిగిల్చిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పాలన చేస్తుందని అన్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 200శాతం కుమ్మక్కయ్యిందని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో, ఎలక్ట్రిసిటీ. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫారం కుంబకోణాలు వెలుగులోకి వచ్చినా ఆ పార్టీ నేతలను అరెస్టులు చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇతర పథకాలలో సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. అందుకే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖం లేకుండా పోయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని, ఎన్నికల్లో ప్రజలే బొంద పెట్టడం ఖాయమన్నారు. బీజేపీ పార్టీ నుంచి అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు పోటీలో ఉంటారని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా పోటీ చేయడం మాత్రం పక్కా అని అన్నారు. స్థానిక పోరులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

అధిక నిధులు తెచ్చింది నేనే
అభివృద్ధి విషయంలో అధిక నిధులు సాధించింది నేనే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంపీ పరిధిలో రూ. 5వేల నిధులు ఉండగా కేంద్రం సాయంతో ఇప్పటి వరకు రూ.12 కోట్ల నిధులు రాబట్టడం జరిగిందని తెలిపారు. ఈ నిధుల్లో ఇప్పటి వరకు 200 రోడ్ల అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు.
kvcs
దీంతో పాటు కొండా వెంకట రంగారెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ట్రక్కులు నడిపిస్తున్నామన్నారు. వచ్చే నెలలో కొత్తగా 5 ట్రక్కులను ఏర్పాటు చేసి దాదాపు 150 గ్రామాలను కవర్ చేస్తామన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ ద్వారానే గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో వసతులు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్. మహిళ మోర్చ నాయకులు అంతారం లలిత, సాహు శ్రీలత లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, వీరశైవ సమాజం సభ్యులు, పార్టీ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సమాజ సేవకే పునరంకితం కావాలి