యాప్‌లో జాబ్స్‌..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

యాప్‌లో జాబ్స్‌..!
– నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం
– అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్‌ ద్వారా నిరుద్యగ యువతకు ఉద్యోగ సమాచారం అందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి..? ఎలా నమోదు చేసుకోవాలనే దానితో పాటు ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ వివరాలను కూడా అందిస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వం యువ వికాసం కార్యక్రమంతో నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయాన్ని అందించి ఉపాధి కల్పించనుంది. మరో అడుగు ముందుకేసి నిరుద్యోగ యువత కోసం డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ అఫ్ తెలంగాణ) ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టింది.. ఈ యాప్ కంపెనీ లకు, నిరుద్యోగ యువతకు వారధిగా పనిచేస్తోంది. అంతేకాకుండా నైపుణ్యా లను పెంచుకునేం దుకు శిక్షణ సంస్థల సమాచారాన్ని అంది స్తోంది. రిజిస్ట్రేషన్ వివరాలనుబట్టి మెను తయారు చేస్తోంది. విద్యా ర్థులకు ఇంటర్న్ షిప్, అప్రెంటీ స్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. డీట్ యాప్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిశ్ర మల జనరల్ మేనేజర్ మహేశ్వర్ తెలిపారు.

ఎలా డౌన్‌లో చేసుకోవాలంటే..
గుల్ ప్లే స్టోరక్కు వెళ్లి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత అందులో ఉద్యోగార్థిగా చేరి… ఇంటి పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, లింగం, విభిన్న వికలాంగులు, సామాజిక స్థితి, చిరునామా వంటి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. అంతేకాకుండా తెలిసిన భాషలు, విద్యార్హత, నైపుణ్యాలు, విద్యాభ్యాస సమాచారం. అనుభవం తదితర వివరాలను పూరించాలి. తర్వాత మెనూకు వెళ్లి ఉద్యోగాలను అన్వేషించాలి. ఉద్యోగాన్ని ఆమోదిస్తే ఉద్యోగదారు డితో సంభాషించాలి. మౌఖిక పరీక్షకు పిలిస్తే నిర్దే శిత తేదీ రోజున వెళ్లాలి. ఉద్యోగానికి ఎంపికైతే ఉద్యోగ నియామక పత్రాన్ని పొందుతారు.

ఇదికూడా చదవండి…

ఇందిరమ్మ ఇళ్లు.. ఇంకెప్పుడో..!