కాళీకాదేవి వైభోగం..!
– ఘనంగా బోనాల జాతర ఉత్సవాలు
– దర్శించుకున్న, నేతలు ప్రముఖులు
– శోభాయామానంగా బోనాల ఊరేగింపు
– ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాళికాదేవి ఆలయంలో అమ్మవారి వైభోగం వెల్లివిరిసింది.

ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయ చైర్మన్ పి.బస్వరాజ్, ఈఓ నరేందర్, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అషాఢ బోనాల జాతర వేడుకల సందర్భంగా ఆలయంలో వెలసిన కాళికాదేవి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. మధ్యాహ్నం మహిళ భక్తులు బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు.

ఆలయంలో బోనాల ప్రదక్షణలు శోభాయామానంగా కనువిందు చేశాయి. జాతర సందర్భంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప, ముదిరాజ్ సంఘం నాయకులు దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో ముఖ్య అతిథిగా హాజరై విశ్రాంత ఉద్యోగి మధుసూదన్ రావుతో సంఘం సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. మరోవైపు రేపు సోమవారం అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపుతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ తాడెం నరేందర్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

