నాణ్యత మరవొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నాణ్యత మరవొద్దు..!
– ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోం
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
– నేష‌న‌ల్ హైవే లింకురోడ్డు నిర్మాణ ప‌నుల ప‌రిశీల‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కేంద్ర ప్ర‌భుత్వ‌ నిధులతో తాండూరు మీదుగా నిర్మిస్తున్న నేషనల్ హైవే లింకు రోడ్డు నిర్మాణంలో నాణ్యతను మరవొద్దని, నాసిరకంగా నిర్మించి నిధులు దుర్వినియోగం చేస్తే ఊరుకోమని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి యు.రమేష్ కుమార్ పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి శివాజీ చౌరస్తా వరకు కేంద్రం నిధులతో వేస్తున్న నేషనల్ హైవే లింకు రోడ్డు పనులను పరిశీలించారు. ఈ రోడ్డు పనులను నాసిరకంగా… నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఆర్అండ్అబి అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహించరాదన్నారు. కేంద్రం నిధులను దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన కరణ్ కోట్, తట్టెపల్లి, జినుగుర్తి రోడ్లను మరమ్మత్తులను చేపట్టి బాగు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, తాండూరు మండల ఇంచార్జ్ పూజారి పాండు. తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్ తదితరులు ఉన్నారు.