మున్సిపల్ కమీషనర్ కు ఉత్తమ అవార్డు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ కమీషనర్ కు ఉత్తమ అవార్డు
– స్పీకర్, కలెక్టర్, ఎమ్మెల్యేల ద్వారా ప్రధానం
– శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డికి ఉత్తమ అవార్డు దక్కింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అవార్డును అందుకున్నారు.
kvcs
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఉత్తమ అవార్డు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్ ఉద్యోగులు, నేతలు కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

రామందిరానికి ఉద్యోగి చేయూత