వసీం రిజ్విపై చర్యలు తీసుకోవాలి
– తాండూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎంఐఎం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: షియా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు వసీం రిజ్విపై రాష్ట్రంలో ఫిర్యాదులు, నిరసనలు నిరంతరం పెరుగుతున్నాయి. దేశంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నంగా వసీం రిజ్వి చేసిన ఈ డిమాండ్‌లను వ్యతిరేకిస్తూ తాండూరులో ఎంఐఎం నేతలు ఖండించారు. గురువారం ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది షయేరీ ఆధ్వర్యంలో నాయకులు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ షియా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు వసీం రిజ్వి మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వాఖ్యలను చేసి లక్షలాది మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. శాంతికి భంగం కలిగించడానికి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాజిద్ అలీ, నాయకులు యూనుస్, నబి సాబేర్, అన్వర్ ఖాన్, జిలాని, అజహరుద్దీన్ మరూఫ్, ఉమర్ ఖాన్, మోసిన్, రవూఫ్ ఖాన్, మోయిజ్, నవీద్ ఖాన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
