కన్నుల పండుగలా శ్రీకృష్ణ తులసీ వివాహము
– కోట్రిక నివాసంలో వైభవంగా పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీక మాసం శుద్ద ద్వాదశిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో శ్రీకృష్ణ తులసీ దేవత వివాహ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం రాత్రి తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో తులసీ వివాహా వేడుకలు నిర్వహించారు. కోట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో మహిళలు తులసీ చెట్టుకు పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్ముని చిత్రపటాన్ని ఉంచి తులసీ వివాహాము జరిపించారు. అనంతరం తులసీ మాతను కీర్తిస్తూ గీతాలను ఆలాపించారు. దీంతో తులసీ పూజతో పాటు శ్రీకృష్ణ తులసీ వివాహా వేడుక వైభోగంగా జరిగింది.
