గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి
– ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరిత్యా చర్యలు
– న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తాండూరు న్యాయవాదులు అవగాహన కల్పించారు. శుక్రవారం తాండూరు మండల లీగల్ సర్వీస్ కమిటి ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్యానల్ న్యాయవాది జిలాని, న్యాయవాదులు సుదర్శన్, ఆంనద్ లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. విద్యాహక్కు చట్టం ఆర్టికల్ 21ఏ ప్రకారం ఉచిత నిర్బంద విద్యను అభ్యసించే హక్కును కల్పించిందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని అన్నారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఎవరైనా ర్యాగింగ్ లకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తప్పవని అన్నారు. బడీడు పిల్లలు చదువుకోకుండా బాలకార్మికులుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తే చైల్ లైన్ 1098కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యమాజన్యం, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

