తాండూరులో ప్రశాతంగా టెట్ పరీక్ష
– ఉదయం 16, మధ్యాహ్నం ఒకరి గైర్హాజరు
– పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం నిర్వహించిన టెట్ పరీక్ష తాండూరులో ప్రశాంతంగా కొనసాగింది. టెట్ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం మొదటి పేపరు కోసం పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో 240 మందికి అలార్ట్ చేయగా 7 నుంది గైర్హాజరు అయ్యారు. నలంద స్కూల్లో 220 మందికి అలార్ట్ చేయగా 5 మంది గైర్హాజరు అయ్యారు. సెయింట్ మార్క్స్ స్కూల్లో 240 మందికి అలార్ట్ చేయగా 4 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం రెండో పేపరు కోసం నలంద స్కూల్లో 10 మందికి అలార్ట్ చేయగా ఒకరు గైర్హాజరు అయ్యారు. మొత్తం 710 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 17 మంది గైర్హాజరు అయినట్లు రూట్ ఆఫీసర్లు తెలిపారు. మరోవైపు టెట్ పరీక్ష సందర్భంగా తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.





