అపూర్వం.. అద్భుతం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అపూర్వం.. అద్భుతం..!
– పూర్వ విద్యార్థుల సమ్మేళనం
– 30 ఏండ్ల తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: 30 ఏండ్ల తరువాత తిరిగి కలుసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వం.. అద్భుతంగా కనిపించింది. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 1994లో పదో తరగతి విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నారు. సుమారు 50 మంది విద్యార్థులు ఎక్కడెక్కడో నుంచి తము చదువు కున్న పాఠశాల లో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ అనుభవాలను తాము ఏమేమి చేస్తున్నారో చెప్పారు. అంతేకాకుండా 30 సంవత్సరాల క్రితం తమకు విద్యాబోధనలు చేసిన ఉపాధ్యాయులను సగర్వగా సన్మానించి వారికి పాదాభివందనాలు చేసి తమగురుభక్తిని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. అనంతరం తము చదుకున్న పాఠశాలకు సూమారు రూపాయలు 60 వేల విలువగల సౌండ్ సిస్టంను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ సార్ కు అందజేశారు. గురువులు చూపిన బంగారు బాటలో నడవడం వల్లనే తాము ఉన్నత స్థాయికి చేరుకున్నామని పూర్వ విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకరయ్య, సుభాన్ రెడ్డి, నాగయ్య, మల్లేశం, సత్యం, రాములు, ఏలియా సార్, మరియు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడ చదవండి…
పట్నం ఇంటికి పైలెట్..!
– ఇరువర్గాలలో జోరుగా చర్చలు
– రాజకీయ పరిణాలపై మాటామంతి
https://dharshininews.com/17369
chaithany collage