పల్లె పాలనలో ప్రత్యేకతను చాటుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పల్లె పాలనలో ప్రత్యేకతను చాటుకోవాలి
– గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా దృష్టిసారించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాల్లో ప్రారంభమైన ప్రత్యేక పాలనలో కొలువుదీరిన అధికారులు ప్రత్యేకతను చాటుకునేలా విధులు నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని పంచాయతీల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులకు శుభకాంక్షలు తెలిపారు. గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా నియమించబడిన అధికారులు బాధత్యగా విధులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పార్టీల నాయకులు, యువజన సంఘాల సమన్వయంతో గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!