ఇంటింటి ఆనందాలు వెల్లి విరియాలి
– దీపావళీ శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శని ప్రతినిధి: అమావాస్య చీకట్లను ప్రారదోలుతూ వచ్చే దీపావళి పండగతో ప్రజలందరి ఇంటింటి ఆనందాలు వెల్లి విరియాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం దీపావళి సందర్భంగా ఆమె తాండూరు నియోజకవర్గంతో పాటు పట్టణ ప్రజలందరికి దీపావళీ పండగ శుభాకాంక్షలను తెలిపారు. ప్రజలందరికి ఈ పండగ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగించాలని ఆకాంక్షించారు. కరోనా దృష్ట ప్రజలందరు నిబంధనలు పాటించాలన్నారు. ఇంటింటా దీపాలు వెలిగించి కాలుష్య రహిత టపాసులను పేల్చాలని సూచించారు. ఇంటింటా కుటుంబీకులంతా కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
