హనుమాన్ సేవలో బీఎస్ఆర్

తాండూరు రాజకీయం వికారాబాద్

హనుమాన్ సేవలో బీఎస్ఆర్
– బెన్నూర్‌లో ఆంజనేయ స్వామికి పూజలు
– శ్రావణమాసం ముగింపులో శ్రీనివాస్ రెడ్డి సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమాన్ సేవలో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) తరించారు. మంగళవారం యాలాల మండలం బెన్నూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రావణమాసం ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఆలయంలో వెలసిన స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కృపతో అందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గురురాజ్ జోషి, నాయకులు శరణు, గ్రామ పెద్దలు, యువనాయకులు భరత్‌ జోషి, వికాస్ జోషి, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి