రేపు తాండూరులో పవర్ కట్..!
– విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే
– కారణాలు ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ డీఈ భానుప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు.
బంటారం మండలం తొర్మామిడి వద్ద 33కేవి ఫీడర్ మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కారణంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని వివరించారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

