శక్తి స్వరూపిణీ.. కట్ట మైసమ్మా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శక్తి స్వరూపిణీ.. కట్ట మైసమ్మా..!
– నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– కట్ట మైసమ్మ దేవాలయంలో పూజలు, అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కోరిన కోర్కెలు తీర్చే కట్ట మైసమ్మా.. శక్తి స్వరూపిణి అవతారం అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం పెద్దల(పెత్తర) అమావాస్య సందర్భంగా తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంట వద్ద వెలసిన కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమావాస్య సందర్భంగా అల్లంపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. 34 నెలలుగా అన్నదానం చేస్తున్న ప్రకాష్ కుటుంభీకులకు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కట్ట మైసమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అదేవిధంగా దేవాలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అన్నారు. బతుకమ్మ సంబరాలను కూడా జరుపుకోవాలన్నారు.
kvcs
మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సింధూ కాలేజీ నుంచి చైతన్య స్కూల్ వరకు రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు వేణుగోపాల్, నరేష్, సుధాకర్, కూజాల నర్సింలు, అంజిలయ్య, పాపయ్య, రమేష్, వెంకటేష్, కిషోర్, నందు నాయక్, జైప్రకాష్, అలంపల్లి శ్రీనివాస్, రాజు, రాము, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పట్ట పగలే.. దారుణం..!