పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
– తాండూరు పోలీస్టేషన్లో కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పనికి వెళుతున్నానని చెప్పి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. తాండూరు పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదయ్యింది.

బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు 18వ వార్డుకు చెందిన మహమ్మద్ యాసీన్ బైగ్(55) కార్పెంటర్ కూలీగా పనులు చేసేవాడు. ఈనెల 12న బషీరాబాద్ లో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించినా ఫలించలేకుండా పోయింది.

ఈనెల 14న తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు యాసీన్ బైగ్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో కుటుంభీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా అదృశ్యమైన యాసిన్ బైగ్ ఆచూకీని కని పెట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎవరైనా యాసిన్ బైగ్ ఆచూకీని గుర్తిస్తే.. అతని గురించి తెలిస్తే తాండూరు పోలీసులు, లేదా సెల్ : 9912823993, 807429270లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

