మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి
– యార్డు డ్రైనేజీ మరమ్మత్తులకు ప్రాధాన్యం
– హామాలి, చాట, దడుపై కార్మికుల చార్జీ పెంపుకు దృష్టి
– ఏఎంసీ చైర్ పర్సన్ గద్దె వీణ శ్రీనివాస్ చారి
– కార్యాలయంలో సాధారణ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుఉతుందని కమిటి చైర్ పర్సన్ గద్దె వీణ శ్రీనివాస్ చారి అన్నారు. పాలకవర్గం ఏర్పాటు తరువాత శనివారం చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి అధ్యక్షతన మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటికి సంబంధించి పలు అంశాలపై చైర్ పర్సన్, డైరెక్టర్లు చర్చించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ మార్కెట్ కమిటి యార్డులో డ్రైనేజీ మరమ్మత్తులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పూర్తి చేయిస్తామన్నారు. అదేవిధంగా యార్డులో పనిచేస్తున్న హమాలీ, చాట, దడుపై కార్మికుల చార్జీల పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం అధికారులు చైర్ పర్సన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.

మరోవైపు మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సిద్ధమ్మ పదోన్నతిపై ధారూర్ మార్కెట్ కమిటికి వెళుతున్న సందర్భంగా ఆమెను పాలకవర్గం తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, కార్యదర్శి రాజేశ్వరి, అధికారి హబీబ్, డైరెక్టర్లు హరిహరగౌడ్, ఖాశిం, ఎం, ప్రకాశం, బాను, ఏఓ రజిత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడ చదవండి..

14 మంది మట్కారాయూళ్లపై కేసు