అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలింపు
– పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న లారీని పెద్దేముల్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఏఎస్ఐ నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ తహసీల్దార్ ఫహీమ్ ఖాద్రి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం ఏఎస్ఐ నారాయణ కానిస్టేబుల్ ప్రవీణ్‌లతో కలిసి పెద్దేముల్ మండల పరిధిలోని పాషా పూర్ గ్రామ సమీపంలో తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తున్న లారీ AP9Y7478 లారీని పట్టుకున్నారు. వెంటనే దానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు.
