రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి
– అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్ ఎన్నిక
– చాకలి ఐలమ్మ జయంతి జయప్రదానికి పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం కమిటి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూత కమిటి గౌరవాధ్యక్షులుగా సుధాకర్, అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తిమ్మాయిపల్లి శ్రీఇనవాస్, ఉపాధ్యక్షులుగా ఆర్. రమేష్, మహిళల ఉపాధ్యక్షురాలుగా సంధ్యారాణి, కోశాధికారిగా రాములు, కార్యదర్శిగా వెంకట్ (పంచాయతీ కార్యదర్శి), మహిళ కార్యదర్శురాలుగా టి.అనురాధ, తాండూరు మండల ఆర్గనైజర్ గా చంద్రయ్య, యాలాల మండల ఆర్గనైజర్ గా శేఖర్ లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటిలకు చేయూత అందించాలని, రజకుల అభ్యున్నతికి ఐక్యత కృషి చేయాలన్నారు. ఈనెల 26న జరిగే చాకలి ఐలమ్మ జయంతిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

