స్పెషల్ క్లాసుల రచ్చ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్పెషల్ క్లాసుల రచ్చ..!
– విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టిన హెచ్ఎం
– సెల్‌ఫోన్లో వీడియో తీసిన సీనీయర్ టీచర్
– జిల్లా విద్యాధికారి వరకు పంచాయతీ
– ప్రభుత్వ నెంబర్ 1 స్కూల్లో ఏం జరిగిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులు ఇద్దరు టీచర్ల మద్య అహం.. వైరంను బహిర్గతం చేశాయి. ఈ స్పెషల్ క్లాసులకు హాజరు కాని విద్యార్థులకు హెచ్ఎం మోకాళ్లపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇవ్వగా.. అదే స్కూల్ సీనీయర్ టీచర్ సెల్‌ ఫోన్లో వీడియో తీసి జిల్లా విద్యాధికారికి పంపించారు.

ఈ సంఘటన తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబరు-1 ఉర్దూ మాధ్యమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉర్దూ మీడియం పాఠశాలలో ఓ జూనియర్ టీచర్‌ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో ఓ సీనీయర్ కూడా ఉపాధ్యాయుడుగా పనిచస్తున్నారు. అయితే పాఠశాలలోని పదోతరగతి విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులకు కొంత మంది విద్యార్థులు హాజరు కావడం లేదు. గమనించిన హెచ్ఎం బుధవారం క్లాసులకు హాజరు కాని విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు.
kvcs
విద్యార్థులు మోకాళ్లపై కూర్చున్న వీడియోను సీనియర్ టీచర్ తన సెల్‌ఫోన్‌లో తీసి జిల్లా విద్యాధికారికి పంపించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ గురువారం పాఠశాలను సందర్శించి వివరాలను ఆరా తీశారు. స్పెషల్‌ క్లాసులకు విద్యార్థులు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను మోకాళ్లపై కాసేపు నిలబెట్టారని తెలిపారు. ఈ దృశ్యాన్ని పాఠశాలకు చెందిన సీని యర్ ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో చిత్రీ కరించి జిల్లా విద్యాధికారికి పంపించినట్లు తెలిపారు. అయితే హెచ్ఎం స్థానంలో సీనియర్‌ ఉపాధ్యాయుడుకు బదులు జూనియర్ ఉపాధ్యాయురాలు కొనసాగడాన్ని అంగీకరించ లేకే ఇదంతా చేశారని తెలిపారు.

ఇదికూడా చదవండి…

రైలు ఇంజన్లో అంతరాయం..!