ఉద్యోగుల బకాయిలు క్లీయర్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఉద్యోగుల బకాయిలు క్లీయర్..!
– నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
– ఆదేశాలు జారీ చేసిన డీప్యూటీ సీఎం భట్టీ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు తీపికబురు చెప్పింది. శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం జరిగింది.

గత ప్రభుత్వం హయాం నుంచి పెండింగ్‌ లోఉన్న బకాయిలతో పాటు పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. ఈ మేరకు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు 1,031 కోట్ల రూపాయలను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు.
kvcs
అదేవిధంగా 10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు 320 కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు విడుదల అధికారులు చేశారు. రోడ్లు , భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ , గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు.

ఇదికూడా చదవండి…

పౌష్టికహారంతో టీబి నియంత్రణ