రవిశంకర్ గురూజీని కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రముఖ అధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కలిశారు. మంగళవారం హైదరాబాద్ మానసగంగ ఆశ్రమాన్ని రవిశంకర్ గురూజీని సందర్శించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ రవిశంకర్ గురూజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురూజీ ఆశీర్వాదం తీసుకున్నారు. అనతంరం రోహిత్‌రెడ్డి పలు విషయాలపై గురూజీతో సంభాషించారు.
