రేపు మృతుల కుటుంబాలకు పరిహారం
– ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందజేయనున్నారు.

మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన తనూష గౌడ్, సాయిప్రియ గౌడ్, నందిని గౌడ్, లక్ష్మీనారాయణ పూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి, హాజిపూర్ కు చెందిన భార్య భర్తలు, తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన సలేహా భేగం, ఖాలీద్, రెండు నెలల చిన్నారి, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, వాల్మీకీనగర్ కు చెందిన వెంకటమ్మలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ల ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు రూ.7లక్షల చెక్కులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ఇదికూడా చదవండి…

