హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత
– కుటుంబానికి రూ. 1.20లక్షల ఆర్థిక సాయం
– క్వింటాళ్ రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు
– వాట్సాఫ్‌ మేసేజ్‌తో చేవేళ్ల గొల్లపల్లి వాసుల ఔధార్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన హాజీపూర్ గ్రామ అక్కా చెల్లెళ్లకు చేయూత అందింది. చేవేళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కందికొండ విఘ్నేష్ గౌడ్ లు తమ వంతు సాయం అందించి ఔధార్యాన్ని చాటుకున్నారు.

ఈనెల 2న చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా అందులో యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప, లక్ష్మీలు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో వారి కూతుళ్లు భవానీ, శివలీలలు అనాథలుగా మారారు. ఈ కుటుంబ పరిస్థితిని చేవేళ్ల వాట్సాప్ గ్రూపులో చూసిన గొల్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కందికొండ విఘ్నేష్ గౌడ్ లు చలించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. శనివారం హాజీపూర్ గ్రామానికి చేరుకుని అక్కాచెల్లెళ్ల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తమ వంతుగా శ్రీనివాస్ గౌడ్ రూ. 1 లక్షల నగదు, విఘ్నేష్ గౌడ్ రూ. 20వేల నగదు మొత్తం రూ. 1 లక్ష 20వేల ఆర్థిక సాయంను అందజేశారు.
kvcs
అదేవిధంగా కుటుంబానికి రెండు నెలలకు సరిపడా క్వింటాళ్ రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు ప్రమాదం బాధాకరమైన దుర్ఘటన అని అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన అక్కా చెల్లెళ్లకు తమ వంతు సాయం అందించడం జరిగిందన్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఊరెళ్ళా మాజీ సర్పంచ్ ఎండి.జంగిర్, మహేష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న మనషులే అక్కా చెల్లెళ్ల పట్ల చేయూతను చాటుకుంటుంటే.. తాండూరు ప్రాంతానికి చెందిన వారు ముందుకు రాకపోవడం విచారకరమని పలువురు పెదవులు విరుస్తున్నారు. ఇప్పటికైనా మనసున్న మనులు స్పందించి అక్కా చెల్లెళ్లను ఆదుకునేలా సాయం అందించాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..!