స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్
– ఆసుపత్రికి తరలించడంతో సేఫ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్ తగిలి ఆసుపత్రి పాలు అయ్యింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ సంఘటన సోమవారం పెద్దేముల్ మండలం మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగింది. పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రవికుమార్ కూతురు వాణిశ్రీ మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం తరువాత పాఠశాల గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉండగా గదిలో ఉన్న యూపీఎస్ బ్యాటరీల వద్ద విద్యుత్ షాక్ తగిలిగింది.

తోటి విద్యార్థులకు తెలపడంతో విషయం తెలుసుకున్న హెచ్ఎం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే వాణిశ్రీని తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ తో భయాందోళనకు గురైన విద్యార్థిని చికిత్స తరువాత కోలుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బాలిక సురక్షితంగా ఉండడంతో హెచ్ఎం, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదికూడా చదవండి…

పట్టణాభివృద్ధిపై దృష్టి సారించండి