దేశ పాలనకు రాజ్యాంగమే కీలకం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

దేశ పాలనకు రాజ్యాంగమే కీలకం
– పౌరులందరికి స్వేచ్ఛ, సమాన హక్కులు
– గ్రంథంను గౌరవించడం, కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత
– శ్రీ నేతాజీలో అట్టహాసంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ పాలనకు రాజ్యాంగమే రక్ష.. కీలకమని తాండూరులోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పాఠశాలలో అట్టహాసంగా జరుపుకున్నారు.

జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో భారత మాత, భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు రాజ్యాంగంపై ఉపన్యాసాలు ఇచ్చి ఆకట్టుకున్నారు. అదేవిధంగా రాజ్యాంగంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, ప్రసంగం, క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేత విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల మాట్లాడుతూ భారత దేశంలో రాజ్యాంగం ఎంతో గొప్పదని అన్నారు. రాజ్యాంగంతోనే దేశంలో అందరికి సుపరిపాలన అందుతోందని అన్నారు. రాజ్యాంగం వల్ల ప్రతి పౌరుడికి స్వేచ్చ, సమాన హక్కులు దక్కాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివలీల, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!