విద్య, పౌష్టికాహారంపై నిర్లక్ష్యం చేయొద్దు
– విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి
– బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, దర్శిని ప్రతినిధి: గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో, వారికి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. గురువారం తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. సంవత్సరన్నర తర్వాత పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థులంతా కూడా అధిక శాతంలో హాజరవుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం 5వ, 6వ తరగతులలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు నిత్యం పాఠశాల వద్దకు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రెండు మూడుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ భోదించే టీచర్ రాబోతున్నారని తెలిపారు. దీంతో రాజ్ కుమార్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి వారి సమస్యలను కూడ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన సి విటమిన్ గల పౌష్టికాహారం అందించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడ చదువుపై దృష్టి పెట్టాలని, వచ్చే వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలతోపాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం కార్యదర్శి బోయ రాధాకృష్ణ, యలాల్ మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి, తదితరులు పాల్గొన్నారు.

